నెట్‌బాల్‌కు అవకాశమివ్వండి
- తెలంగాణ క్రీడా శాఖకు నెట్‌బాల్ అసోసియేషన్ విజ్ఞప్తి
- ఖేలో ఇండియా గేమ్స్ ఆతిథ్యం గొప్ప అవకాశమన్న విక్రమాదిత్య రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 5 : ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (Khelo India Youth Games) 2026కు డి సెంబర్‌లో తెలంగాణ అతిథ్యం ఇవ్వబోతోం ది. ఈ నేపధ్యంలో ఆతిథ్య రాష్ట్రహోదాలో మూడు క్రీడలను ఎంపిక చేసే అవకాశం తెలంగాణకు ఉంటుంది.
దీనిలో భాగంగా నెట్‌బాల్‌కు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో అవకాశమివ్వాలని తెలంగాణ అమెచ్యూ ర్ నెట్‌బాల్ అసోసియేషన్ విక్రమాదిత్య రెడ్డి క్రీడా శాఖకు విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇం డియా యూత్ గేమ్స్‌కు ఆతిథ్యం తెలంగాణ రాష్ట్రానికి రావడంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన క్రీడా శాఖకు కొన్ని ప్రశ్నలు వేశారు.
సాఫ్ట్‌బాల్, హ్యాండ్‌బాల్, నెట్‌బాల్ క్రీడల్లో ఏదోక క్రీడను ఎంపిక చేసే ప్రక్రియకు సం బంధించి కొన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాల న్నారు. ఈ మూడు క్రీడలకు సంబంధించిన రాష్ట్ర సంఘాలను సమానంగా పరిగణనలో కి తీసుకుని, గత నాలుగేళ్ల కాలంలో ఆయా క్రీడలు సాధించిన జాతీయ స్థాయి విజయా లు, ప్రదర్శనలు, క్రీడాకారుల ప్రాతినిధ్యం,
రాష్ట్రానికి సాధించిన పతకాలు పారదర్శకంగా పరిశీలించిన అనంతరం నిర్ణయం తీ సుకోవాలని కోరారు. సాఫ్ట్ బాల్ క్రీడను ఎంపిక చేసేందుకు అనుసరించిన ప్రమాణా లు, సాధించిన విజయాలు ఎంపికకు సం బంధించిన నిర్ణయ ప్రక్రియను క్రీడా శాఖ, సాట్స్ స్పష్టంగా వెల్లడించాలని కోరారు.






