ప్రతి డివిజన్ సమగ్ర అభివృద్ధే లక్ష్యం
రూ.3.20 కోట్ల బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన
మహబూబ్‌నగర్ (విజయ క్రాంతి) : ప్రతి డివిజన్(Division) అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని గొల్లబండ తాండా నుంచి పాలిటెక్నిక్ కళాశాల(Polytechnic College) వరకు రూ.3.20 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గొల్లబండ తాండా నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు బీటీ రోడ్డు నిర్మాణంతో స్థానిక ప్రజలు, విద్యార్థులకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మీడియా కన్వీనర్ సిజె బెనహర్ పాల్గొన్నారు.






