దొరికిన బంగారు పుస్తెలతాడు పోలీసులకు అప్పగింత

21-09-2026 | 09:45pm

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల బెల్లంపల్లిలో ఓ యువకుడు తనకి దొరికిన బంగారు పుస్తెల తాడు(gold chain)ను పోలీసులకు అప్పగించిన తన నిజాయితీని చాటుకున్న సంఘటన సోమవారం జరిగింది. బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ వో శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం(Bellampalli Municipality Office) ఎదురుగా ఉన్న గర్ల్స్ హై స్కూల్ ముందు ఒక పుస్తెలతాడు ఒక వ్యక్తికి దొరికింది.

దొరికిన వ్యక్తి తను నిజాయితీగా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్(Bellampalli One Town Police Station) లో అప్పగించారు.  ఈ పుస్తెలతాడు బంగారంతో చేశారు. ఒక గొట్టం బంగారంతో చేసినది.4 గుండ్లు  బంగారవి, దానికి ఉన్న చైన్ రోల్డ్ గోల్డ్ తో చేసిందని బెల్లంపల్లి వన్ టౌన్ SHO కె. శ్రీనివాసరావు తెలిపారు. దొరికిన పుస్తెల తాడు పోలీస్టేషనలో  భద్రంగా ఉందని, పుస్తెల తాడు పోగొట్టుకున్న వారు తగిన ఆధారాలతో వచ్చిన పుస్తెల తాడును తీసుకోవాలని కోరారు. వివరాలకు ఫోన్ నెంబర్లు CI  8712656559, SI - 9440521677 సంప్రదించాలని వెల్లడించారు.

మరిన్ని వార్తలు