హామీల అమలులో ప్రభుత్వం విఫలం
బాన్సువాడ, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి(RDO Ravinder Reddy)కి సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టిఆర్‌ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు అంజిరెడ్డి మోరల్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 420హామీలు, 13డిక్లరేషన్స్,6 గారింటీలు, 100 రోజులలో ఇస్తానని 1000 రోజులు అయినా అమలు చేయని ప్రభుత్వం, వెంటనే హామీలన్నీ ఆమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు ఇప్పటికైనా ఎన్నికలు ఇచ్చిన హామీలను ప్రజలకు వెంటనే అమలుపరచాలని లేనియెడల బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నార్ల రత్న కుమార్, మొచి గణేష్, బాడీ శ్రీనివాస్, అక్బర్, ఖలీల్, మొగులయ్య, మాకూబుల్, ఇషక్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
