కులవృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

17-09-2026 | 06:04pm

రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్

భూపాలపల్లి సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): కులవృత్తుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్(BC Commission Chairman Niranjan) అన్నారు. శ్రీ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఐడీఓసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ రాబోయే జనగణనలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని సూచించారు. కులవృత్తుల అభివృద్ధికి త్వరలో జిల్లా స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ కమ్మరి, కుమ్మరి, ఔసలి, వడ్లంగి, శిల్పి తదితర సంప్రదాయ వృత్తిదారుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని, జిల్లా కేంద్రంలో భవనం, స్థలం, పరికరాల ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ శిల్పకళ, చేతివృత్తులు, సంప్రదాయ నైపుణ్యాలకు విశ్వకర్మ ప్రతీకగా నిలుస్తారని తెలిపారు.

మరిన్ని వార్తలు