గ్రామీణ ప్రాంతాల స్వరూపాన్ని మార్చేందుకు ప్రభుత్వ ప్రణాళిక

27-09-2026 | 05:15am

తాగునీటి సమస్యలకు చోటుండొద్దు : మంత్రి సీతక్క

రంగారెడ్డి, సెప్టెంబర్ 26(విజయక్రాంతి)రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల స్వరూపాన్ని మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ జిల్లాల అ ధికారులతో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష స మావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామీణ ర హదారులు, తాగునీరు, ఉపాధి హామీ పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. దస రా తర్వాత రోడ్డు పనులు ప్రారంభించేందు కు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో రూ.3,382 కోట్ల అంచనా వ్యయంతో 1,013 గ్రామీణ రహదారుల పనులను చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. దసరా ముగిసిన వెంటనే, అక్టోబర్ 25 లేదా 26 తేదీల్లో ఈ పనులను క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప నుల నాణ్యతలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, అధికారులు నిరంతరం పర్యవే క్షించాలని స్పష్టం చేశారు.

తాగునీటి సరఫరాకు రూ.30 కోట్లు..

వర్షపాతం లోటు ఉన్న ప్రాంతాల్లో తా గునీటి ఎద్దడి రాకుండా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు. సింగూరు జలాశయంలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయ బోర్లు, బావులను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. రానున్న వేసవిని దృష్టి లో ఉంచుకుని నాలుగు జిల్లాలకు కలిపి రూ.30 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ’జలశ్రీ’తో భూగర్భ జలాల పెంపునీటి సంరక్షణ కోసం ‘జలశ్రీ’ కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, పంట కుంటలు, చెక్డ్యామ్లు, బోరు రీచార్జ్ పనులతో భూగర్భ జలాలను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన తండాల్లో ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.గ్రామ పంచాయతీ, మహిళా భవనా లు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపాధి హామీ నిధులను పూర్తిగా విని యోగించుకోవాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 1,800 గ్రామపంచాయతీ భవ నాలతో పాటు, మహిళా సంఘాల కోసం 9,000కు పైగా మహిళా భవనాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

అక్టోబర్ 2న గ్రామసభలు....

ప్రతి గ్రామానికి మ్యాపింగ్ ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సం దర్భంగా అన్ని గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి, స్థానిక అవసరాలకు అను గుణంగా నిధుల కేటాయింపుపై తీర్మానాలు చేయాలని సర్పంచులకు పిలుపు నిచ్చారు.


మరిన్ని వార్తలు