ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి

19-09-2026 | 06:25pm

బోథ్ సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి) ప్రభుత్వం పాఠశాలలో ఏదైనా విద్యను అందించేందుకు కృషి చేస్తున్నదని దన్నూరు (Dhannur)గ్రామ సర్పంచ్ వెల్మరోహిని వినయ్ రెడ్డి (Velmarohini Vinay Reddy)పేర్కొన్నారు, శనివారం నూతనంగా మంజూరు అయిన పూర్వ ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ మహమ్మద్ హుస్సేన్ తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన వసతులు కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం 74 పూర్వ ప్రాథమిక పాఠశాలలో మంజూరు కాగా అందులో ధనుర్బీ లో ఒకటి మంజూరు కావడం జరిగింది అన్నారు.

కార్యక్రమంలోనాలుగు సంవత్సరాలు నిండిన బాల బాలికలను ఈ పాఠశాలలో చేర్పించాలన్నారు. ప్రతి పాఠశాల అభివృద్ధికి ఒక లక్ష రూపాయలతో ఆట వస్తువులను పాఠ్యపుస్తకాలను కుర్చీలు టేబుల్స్ విద్యార్థులకు సామాగ్రి అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రధానిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రావుల శంకర్ ,సిబ్బంది రాథోడ్ సవిత ఇయ్యాల స్వప్న మాడ ప్రశాంత్ కుమార్ భువనగిరి సారిక ప్రీ ప్రైమరీ స్కూల్ ఇన్స్పెక్టర్ కుంటశకుంతల, ఆయా సగం ఉమారాణి సుకుమార్, పిఆర్పి రమేష్, వాజిద్ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు