మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామసభ

02-10-2026 | 05:50pm

నాగిరెడ్డిపేట,అక్టోబర్ 2 (విజయ క్రాంతి):మండలంలోని చినూరు గ్రామంలో(Chinnoor Village ) మహాత్మా గాంధీ జయంతి( Gandhi Jayanti) సందర్భంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఈ గ్రామసభలో "స్వచ్ఛ సేవ అంకలన్" బాల్యవివాహాలు, విబి-జి ఆర్ఏఎంజి పథకంలో భాగంగా చేపట్టవలసిన పనుల గురించి మరియు "ఏక్ పెడ్ మాకే నామ్"లో భాగంగా అంగన్వాడి కేంద్రంలో మొక్కలు నాటడం,

సశక్తి పంచాయతీ లైవ్లీహుడ్ పంచాయతీ మరియు జిపిడిపీ పారామీటర్స్ మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క సమస్యల గురించి గ్రామపంచాయతీ పారిశుద్ధ్య పనుల గురించి చర్చించడం జరిగింది.స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచన్పల్లి మురళీమోహన్ గౌడ్,ఉప సర్పంచ్ సుకన్య, పంచాయతీ కార్యదర్శి అనిత,ఫీల్డ్ అసిస్టెంట్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు