మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం
02-10-2026 | 07:14pm
ప్రజల సహకారంతోనే సాధ్యం
రాజాపూర్ అక్టోబర్ 2 : మహాత్మా గాంధీ కలలుగన్న సుస్థిర గ్రామ స్వరాజ్యం(Gram Swarajya) ప్రజల సహకారం ఎంతో అవసరమని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ తిరుమలపూర్ సర్పంచ్ సంతోష వెంకటేష్ అన్నారు.
శుక్రవారం మండల కేంద్రంతో పాటు తిరుమలపూర్ తో సహా పలు గ్రామాల పంచాయితీలలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ప్రజలు పచ్చదనం పరిశుభ్రత కోసం తగిన సహకారం అందిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.