6 September, 2026 | 6:05 PM

అంగరంగ వైభవంగా గణేష్ ఆగమన్...హోరెత్తిన బాన్సువాడ...!

06-09-2026 | 04:56pm

మణికంఠ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ విగ్రహానికి  స్వాగతం

గణపతి నామస్మరణతో మార్మోగిన పట్టణం, జనసంద్రం

బాన్సువాడ, సెప్టెంబర్ 6 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ(Banswada) పట్టణం గణపతి బప్పా మోరియా నినాదాలతో హోరెత్తింది. పట్టణంలోని సంగమేశ్వర కాలనీ(Sangameshwara Colony)కి చెందిన మణికంఠ గణేష్ మండలి ఆధ్వర్యంలో భారీ గణేష్ విగ్రహానికి నిర్వహించిన ఆగమన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ విగ్రహానికి భక్తులు, యువత ఘన స్వాగతం పలకడంతో పట్టణంలో ఎటుచూసినా గణేష్ సందడి కనిపించింది.

డప్పుల మోతలు, బ్యాండ్‌ మేళాలు, గణేష్ నామస్మరణల మధ్య విగ్రహం తరలివెళ్లగా.. యువత ఉత్సాహంగా పాల్గొంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ప్రధాన వీధులు భక్తులతో సందడిగా మారాయి.మణికంఠ గణేష్ మండలి సభ్యులు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తి భావంతో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు.భారీ గణేష్ విగ్రహం ఆగమన్ కార్యక్రమం పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. గణేష్ నామస్మరణతో బాన్సువాడలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు