6 September, 2026 | 8:34 AM

15 మంది విద్యావేత్తలకు ఘన సత్కారం

06-09-2026 | 05:05am

క్యూటీఎఫ్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో..

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాం తి): ఉపాధ్యాయ దినోత్సవం(Teachers Day) సందర్భంగా క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్(Quality Thought Future Skills Foundation,) (క్యూటీఎఫ్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు(Hyderabad Financial District)లోని మెడికవర్ హాస్పిటల్స్(Medicover Hospitals) టీహెచ్ ఆడిటోరియంలో ఆచా ర్య దేవోభవః కార్యక్రమం నిర్వహించారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, నాయక త్వం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలందించిన 15 మంది ప్రముఖ విద్యావేత్తల ను సత్కరించారు.

కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. క్యూటీఎఫ్‌ఎస్‌ఎఫ్ చైర్మన్, ఎండీ రమణ భూపతి, సీఈఓ కృష్ణ చింతలూరి ప్రసంగిం చారు.   సైయంట్ గ్లోబల్ హెడ్, క్యూటీఎఫ్‌ఎస్‌ఎఫ్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ అరవింద్ మాథుర్, రమణ భూపతి, కృష్ణ చింతలూరి, మెడికవర్ హాస్పిటల్స్ డీజీఎంకార్పొరేట్ రిలేషన్స్ శైలజ కోట, క్యూటీఎఫ్ ఎస్‌ఎఫ్ సీబీఓ డాక్టర్ పవని కడియాల ఆధ్వర్యంలో నిర్వహించారు.

సత్కారం పొందిన ప్రముఖుల్లో ప్రొఫెసర్ (డాక్టర్) వి. బాలకిష్టరెడ్డి  టీజీసీహెచ్‌ఈ చైర్మన్, ప్రొఫెసర్ సునై నా సింగ్, మాజీ వీసీ,  డబ్ల్యూ.జి. ప్రస న్న కుమార్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కరికులమ్ డెవలప్మెంట్ అండ్ కెపా సిటీ బిల్డింగ్ విభాగం అధిపతి, ప్రొఫెసర్ కె. చంద్రశేఖర్ నాయుడు  వే ము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపకులు, డాక్టర్ హేమచంద్రన్ కన్నన్  వోక్సెన్ యూనివర్సిటీ  వైస్ డీన్, ఏఐ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్, డాక్టర్ ఆశిమా శర్మ నిమ్స్ హైదరాబాద్ ప్రొఫెసర్, డాక్టర్ నర్సి రెడ్డి మల్గిరెడ్డి హరి యూనివర్సిటీ వీసీ, చంద్రశేఖర్ డి.పి., పీహెచ్‌డీ జేజీఐ స్కూల్స్ సీఈఓ, డాక్టర్ కె.వి.కె. రావు  విద్యావేత్త, పారిశ్రామికవేత్త  ఉన్నారు.

మరిన్ని వార్తలు