MBBSలో ఉచిత సీటు సాధించిన కృపాలి ఖడ్సేకు ఘన సన్మానం
22-09-2026 | 07:57pm
బేలా సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన ప్రవేశ పరీక్షలో స్టేట్ ర్యాంక్ 960 సాధించి, MBBSలో ఉచిత సీటు పొందిన అవినాష్ ఖడ్సే కుమార్తె కృపాలి ఖడ్సేను బెల మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఠాక్రె అశోక్ శాలువాతో సత్కరించి, ఆమెను అభినందించారు. కృపాలి భవిష్యత్తులో వైద్య రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.