21 August, 2026 | 12:51 AM

కొత్త హబ్‌ను ప్రారంభించిన గైడ్‌హౌస్

21-08-2026 12:11 AM

వెయ్యికి పైగా ఉద్యోగాల కల్పన లక్ష్యం

హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో సంస్థ ఏర్పాటు

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ‘గైడ్‌హౌస్’ హైటెక్ సిటీలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ లో కొత్త హబ్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా గైడ్‌హౌస్ పార్టనర్, గ్లోబల మేనేజ్డ్ సర్వీసెస్ లీడర్ అలీ బొఖారీ మాట్లాడుతూ హైదరాబాద్‌లో మా విస్తరణ భారతదేశంలోని ప్రతిభ, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, గైడ్ హౌస్ దీర్ఘకాలిక వృద్ధిలో భారత్ పోషించే కీలక పాత్రపై మాకున్న నమ్మకానికి నిదర్శనమన్నారు.

ఈ కేంద్రం మా ఉద్యోగులు, క్లయింట్లు, మా గ్లోబల్ డెలివరీ మోడల్ భవిష్యత్తు కోసం చేసిన పెట్టుబడి అన్నారు. ప్రముఖ టెక్నాలజీ, వ్యాపార కేంద్రంగా హైదరాబాద్‌కు ఉన్న గుర్తింపు ఇక్కడి బలమైన విద్యా వ్యవస్థ, నైపుణ్యం కలిగిన నిపుణుల లభ్యత భారతదేశంలో గైడ్‌హౌస్ నిరంతర వృద్ధికి సహజ సిద్ధంగా సరిపోతాయన్నారు.

రాబోయే 12 నెలల్లో హెల్త్‌కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లయింట్‌లకు సేవలందించే లక్ష్యంతో మేనేజ్డ్ సర్వీసెస్, టెక్నాలజీ, అనలిటిక్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ రంగాలలో వెయ్యి మందికి పైగా కొత్త నిపుణులను నియమించుకోవాలని యోచిస్తున్నామన్నారు.

ఈ నూతన కేంద్రం నిరంతర సహకారం, సురక్షితమైన కార్యకలాపాలు, విస్తృత క్లయింట్ డెలి వరీ కోసం ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు. గైడ్‌హౌస్ ఇండియా పార్టనర్, మేనేజ్డ్ సర్వీసెస్ అండ్ టెక్నాలజీ లీడ్ వినయ్‌సింగ్ మాట్లాడుతూ హైదరాబాద్ హబ్ ద్వారా సాంకేతిక ఆధారిత మేనేజ్డ్ సర్వీసెస్‌ను విస్తృత స్థాయిలో అందించే సామర్థ్యం మాకు లభిస్తుందన్నారు. క్లయింట్లు తమ కా ర్యకలాపాలను మెరుగుపరుచుకోవడానికి, మార్పును వేగవంతం చేయడానికి దీర్ఘకాలిక విలువలను సృష్టించడానికి ఇది ఎంత గానో తోడ్పడుతుందన్నారు.

గైడ్‌హౌస్ ఇండియా పార్ట్‌నర్, కంట్రీ హెడ్ మహేంద్ర సిం గ్ రావత్ మాట్లాడుతూ హైదరాబాద్ అద్భుతమైన ప్రతిభ, ఆవిష్కరణలు, వ్యాపార వృద్ధి కలయికను అంఇస్తుందన్నరు. ఈ కొత్త హ బ్ ఈ ప్రాంతం పట్ల మా నిబద్ధతను మరింత బలోపేతం చేయడంతో పాటు మా ఉద్యోగులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా క్లయిం ట్‌లకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న టాలెంట్, అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ వ్యవస్థ మా వృద్ధికి కీలకం కానున్నాయన్నారు.