గణేష్ వేడుకల్లో హనుమంతన్న సందడి (వీడియో వైరల్)
హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం తరలివస్తుండగా.. సెక్రటేరియట్(Telangana Secretariat) పరిసరాల్లోనూ గణనాథుడి నిమజ్జన వేడుకలు సందడిగా సాగాయి. సెక్రటేరియట్ ముందు నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు(V. Hanumantha Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వేడుకల్లో ఉత్సాహంగా కనిపించారు. భక్తులు, నిర్వాహకులతో కలిసి నిమజ్జన కార్యక్రమంలో సందడి చేశారు.
గణేష్ నిమజ్జనం(Ganesh Nimajjanam) సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ట్యాంక్‌బండ్ వైపు వివిధ ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలు తరలివస్తుండటంతో శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. నిమజ్జనోత్సవాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణలు, మళ్లింపులు అమల్లో ఉన్నాయి. ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నిమజ్జన కార్యక్రమాలతో హైదరాబాద్‌లో పండుగ సందడి తారస్థాయికి చేరింది.
సెక్రటేరియట్ ముందు గణేష్ నిమజ్జనంలో సందడి చేసిన హనుమంత్ రావు https://t.co/wPR5Hp3JPo pic.twitter.com/p4PH21F42K
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2026