కనుకులలో విద్యుత్ సిబ్బందికి ఘనంగా సన్మానం

25-09-2026 | 06:36pm

సుల్తానాబాద్ , సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ మండలం కనుకుల విద్యుత్ సెక్షన్  సిబ్బంది(Kanukula Electricity Section Staff) నీ శుక్రవారం ఘనంగా సన్మానించారు,  గత ఆరు నెలలుగా రెవెన్యూ వసూళ్లు(Revenue collections) , గృహ వాణిజ్య సంబంధించిన సర్వీసులకు గాను 100 శాతం బిల్లులు వారం రోజుల కు ముందుగానే  వసూలు చేసినందుకు గాను  పెద్దపల్లి ఎస్ ఈ వి, గంగాధర్(Peddapalli SEV, Gangadhar),  డి ఈ సిహెచ్ రాజ బ్రహ్మచారి లు సిబ్బందికి  శాలువాలు  కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది..దీనికిగాను  చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి , కనుకుల విద్యుత్ ఏ ఈ కి, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఏ డి ఈ పి, రామస్వామి, టెక్నికల్ డి ఈ బాలయ్య పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు