భావోద్వేగాల సమాహారం హ్యాపీ జర్నీ
అన్నపూర్ణ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’(Happy Journey). బాలాజీ గుత్తా, కౌశిక్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా (Abhiram Naidu director) పరిచయమవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా శనివారం మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అభిరామ్ నాయుడు మాట్లాడుతూ.. “మన పేరెంట్స్ మీద మనకు చాలా ప్రేమ ఉంటుంది. కానీ దాన్ని చూపించుకునే విధానం చాలా తక్కువ. ఇలాంటి భావోద్వేగాలన్నీ ఈ సినిమాలో చూపిస్తాం. నిజంగా జనాభా పెరిగితే ఒకరికొకరు తోడు పెరగాలి.
కానీ మనం ఒంటరి అవుతున్నాం. ఫోన్ నెంబర్లు ఉంటాయి కానీ ఎవరికీ ఫోన్ చేయలేని పరిస్థితి. ఒకరికొకరు తోడుగా ఉంటే ఎంత అందంగా ఉంటుందనేది ఈ సినిమాలో చూపించబోతున్నాం” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు పాయల్ రాధాకృష్ణ, వంశీ, పృథ్వీ, రవి శివతేజ, సునయన, జినీషా, రూప, తరుణ్, ఎడిటర్ ఛోటా కే ప్రసా ద్ కూడా మాట్లాడారు.