అసెంబ్లీలో బడే భాయ్.. చోటే భాయ్ బంధం
హైదరాబాద్: డైవర్షన్ రాజకీయాలతో ప్రజల దృష్టిని మళ్లించలేరని, ఆంధ్రప్రదేశ్ లో క్రాప్ హాలుడే లేదు.. కానీ తెలంగాణలో క్రాప్ హాలుడే ప్రకటించారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు(Former BRS Minister Harish Rao) పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తలేరని రాష్ట్రంలోని రైతులు(Farmers) ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, కాళేశ్వరం మోటార్లు ఎందుకు ఆన్ చేయట్లేదని రైతులు అడుగుతున్నారు. లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్(Fee reimbursement) కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్నప్పటికీ ఎందుకు ఇవ్వలేదని హరీష్ రావు ప్రశ్నించారు.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు జరిగిన అవమానాలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)కి కనిపించటం లేదా..? అని అడిగారు. అసెంబ్లీలో బడేభాయి.. చోటేభాయి బంధం బయటపడిందని, బీజేపీ(Bharatiya Janata Party) ఎమ్మెల్యేల ప్లకార్డులకు అనుమతి ఇచ్చి మా టీషర్టులు వద్దన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ ఇంటిమీద దాడి చేసేందుకు వెళ్లారని, అంతేకాకుండా ఇద్దురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాత్రికి రాత్రే అరెస్టు చేశారని హరీష్ రావు తెలిపారు. తాతా మధు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని ఏకపక్షంగా రద్దు చేసే కుట్ర చేస్తున్నారని, ఎథిక్స్ కమిటీలో కూడా చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారని ఆయన ఆరోపించారు
ఇవి కూడా చదవండి:
గజ్వేల్‌కు కేటీఆర్, హరీష్ రావు..!
గజ్వేల్‌లో టెన్షన్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ తోపులాట
హరీశ్‌రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ గుస్సా