హైదరాబాద్‌కు ‘హార్వర్డ్’ విద్య

18-09-2026 | 05:15am
  1. డిసెంబర్ నుంచి ఎగ్జిక్యూటివ్ కోర్సులు
  2. ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ హబ్ 
  3. విదేశీ వర్సిటీలతో భాగస్వామ్యాలు
  4. కే బిజినెస్ స్కూళ్ల ప్రతినిధుల భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి   

హైదరాబాద్, సెప్టెంబర్ 17 ( విజయక్రాంతి) : ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి (Harvard University) చెందిన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు హైదరాబాద్‌లో డిసెంబర్ నుంచి అందుబాటులోకి రానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఔత్సాహికులు, వృత్తి నిపుణులకు ఈ కోర్సులను అందించనున్నట్లు తెలిపారు. గురు వారం ఎంసీఆర్‌హెచ్ ఆర్డీలో  కే బిజినెస్ స్కూళ్ల ప్రతినిధులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కే బిజినెస్ స్కూళ్ల డీన్లు, ఉన్నతస్థాయి అధికారులతో చర్చించారు.

కే విశ్వ విద్యాలయాల అవసరాలకు తగ్గట్టు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ఎంఐటీ, పర్డ్యూ వంటి పలు ఐవీ లీగ్ యూనివర్సి టీలు హైదరాబాద్‌లో ఆఫ్ షోర్ క్యాంపస్ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. కే బిజినెస్ స్కూల్స్ తెలంగాణ లో ఏర్పాటైతే ప్రపంచ స్థాయి కార్పొరేట్ వ్యాపార సం స్థలు రాష్ర్టం వైపు చూస్తాయన్నారు.  అదే సమయంలో రాష్ట్ర విద్యార్థులు, అధ్యాపకులకు.. అంతర్జాతీయ సంస్థ లు, అంతర్జాతీయ అనుభవం, ప్రపంచ స్థాయి అవకాశాలు అందుబాటులో వస్తాయన్నారు. హార్వర్డ్, ఎంఐటీ, యూకే, వర్జీనియా టెక్, నార్త్‌ఈస్టర్న్ వంటి  ప్రముఖ అం తర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం లు, డ్యూయల్ డిగ్రీ కోర్సులు, అధ్యాపకుల శిక్షణ, పరిశోధన వంటి రంగాల్లో భాగస్వాములం కావచ్చన్నారు. 

గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీ

యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ అందించేందుకు భారత్ ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రతినిధులకు వివరించారు. ఫ్యూచర్ సిటీని దేశంలోనే మొట్టమొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నామనారు. ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుతో భావితరా లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. డిసెంబర్ లో అక్కడ నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కే బిజినెస్ బృందానికి ఆహ్వా నం పలికారు.

దావోస్ లో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తరహాలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. 2047 నాటికి తెలంగా ణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2034 నాటికి ఒక టిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు  సీఎం వివరించారు.  


మరిన్ని వార్తలు