స్పోర్ట్స్ కోటా చర్చ పక్కదారి?

13-09-2026 | 05:05am
  1. ఎమ్మెల్సీ పోచంపల్లి ప్రశ్నకు మంత్రి దాటవేశారు  
  2. ఇప్పటికైనా న్యాయం చేయాలి
  3. ప్రభుత్వానికి డీఎస్పీ-2024 స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల విజ్ఞప్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా(Sports Quota)లో చోటు చేసుకున్న అవకతవకలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి(Pochampally Srinivas Reddy) శాసనమండలి(Legislative Council)లో అడిగిన ప్రశ్నకు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Vakiti Srihari) తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని స్పోర్ట్స్ ప్లేయర్స్(Sports players) బాధితులు శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. డీఎస్సీ  స్పోర్ట్స్ కోటా టీచర్ల(DSC Sports Quota Teachers) నియామకాల్లో జరిగిన అవకతవకల విషయం తన దృష్టికి రాలేదంటూ మంత్రి తప్పించుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.

2024 డీఎస్పీ స్పోర్ట్స్ కోటాలో టీచర్ల నియామకాల్లో జరిగిన తప్పులను సరిదిద్దాల్సిన అవసరం ఉందని సభలో ఎమ్మెల్సీ పోచంపల్లి ప్రస్తావించినట్లు బాధితులు తెలిపారు.  క్రీడాకారుల సంక్షేమం(Welfare of Sportspersons), అభివృద్ధికి  ప్రభుత్వం కట్టుబడి ఉందని..  అన్ని వసతులు కల్పిస్తున్నామని, రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆచరణలో ప్రభుత్వం తీరు మరోలా ఉందని ఎమ్మెల్సీ సభ దృష్టికి తీసుకువచ్చారని బాధితులు తెలిపారు.

స్పోర్ట్స్ కోటాలో 100 పోస్టులకు నోటిఫికేషన్ వేసి కేవలం 33 పోస్టులను మాత్రమే భర్తీ చేశారని, మిగిలిన పోస్టులను జనరల్‌కు మార్చిన తీరును కూడా పోచంపల్లి సభ దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. జాతీయ క్రీడాకారులకు కాకుండా  అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారనే విషయంపై కోర్టుకు వెళ్లిన వారికి ఇప్పటివరకు న్యాయం చేయలేదని, కనీసం కోర్టుకు కూడా ప్రభుత్వం తరుపున కౌంటర్ అఫిడవిట్ ఇవ్వకపోవడంపై ఎమ్మెల్సీ ప్రస్తావించారని పేర్కొన్నారు. 70 పోస్టులకు మళ్లీ  స్పోర్ట్స్ కోటాలో నియమకాలు చేయాలని కోరగా, మంత్రి వాకిటి శ్రీహరి ఈ విషయం తన దృష్టికి రాలేదని, ఎవరు కూడా తనను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వలేదని తప్పుడు సమాచారం ఇచ్చారని అభ్యర్థులు ఆరోపించారు. 

రీవెరిఫికేషన్‌తో జాప్యం

రీవెరిఫికేషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని, తమకు జరిగిన అన్యాయంపై జాతీయ క్రీడాకారులందరం గతేడాది సెప్టెంబర్‌లో క్రీడా శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు. సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి ఆ తర్వాత ఎన్నిసార్లు కలిసిన పరిశీలనలో ఉందని చెప్పారే తప్ప.. ఇప్పటివరకు రివెరిఫికేషన్ వివరాలను వెల్లడించలేదన్నారు. దీని వల్ల తమకు ఉద్యోగాలు రాకుండా పోయాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అడిగిన ప్రశ్నకు తమ దృష్టికి రాలేదని మంత్రి చెప్పడం సరైనది కాదని, ఇప్పటికైనా న్యాయం చేయాలని బాధిత అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు