ఛాన్సులు రావాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు!

08-09-2026 | 05:45am

ఇటీవల ‘గాంధారి(Gandhari)’, ‘అస్సీ(Assi)’ వంటి థ్రిల్లర్ చిత్రాల(Thriller films)తో ప్రేక్షకులను అలరించింది బాలీవుడ్ స్టార్ బ్యూటీ తాప్సీ పన్ను(Bollywood star beauty Taapsee Pannu). ప్రస్తుతానికి ఆమె చేతిలో ఎలాంటి ప్రాజెక్టులూ లేవు. ఇదిలావుండగా తాప్సీ ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో(Interviews) పాల్గొంటూ పలు వివాదాస్పద కామెంట్ల(Controversial comments)తో వార్తల్లో నిలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా, సినీ ఇండస్ట్రీ(Film industry)లో ఛాన్సుల తీరుతెన్నుల గురించి చెప్తూ సంచలన వ్యాఖ్యలు(Sensational comments) చేసింది తాప్సీ. షారుఖ్ ఖాన్ కాంబోలో వచ్చిన ‘డంకీ’ లాంటి సక్సెస్ తర్వాత కూడా తనకు కమర్షియల్ సినిమా(Commercial cinema)ల్లో ఆశించిన అవకాశాలు రాకపోవడంపై మాట్లాడుతూ.. “సినీ పరిశ్రమలో నటీనటులు(Cast) ఎవరైనా రీప్లేస్ అయిపోతారని అభిప్రాయపడింది తాప్సీ.

“కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఎవరైనా చేసేలా ఉంటాయి. వారికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. అవకాశాలు రావడం అనేది కేవలం నటుల టాలెంట్‌పై మాత్రమే ఆధారపడి ఉండదు. మార్కెట్ వాల్యూ, పబ్లిసిటీ, ఇండస్ట్రీలో ఉండే పరిచయాలు, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలే పాత్రల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి నెట్‌వర్కింగ్ విషయంలో నేను కాస్త వెనుకబడి ఉన్నాను.

కేవలం నా టాలెంట్ మాత్రమే నాకు అవకాశాలు తెచ్చిపెడుతుంది. ‘డంకీ’ సినిమాలో నాకు ఛాన్స్ రావడానికి కారణం దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీనే. ఆయన నా గత పర్ఫార్మెన్స్ చూసి పట్టుబట్టి ఆ రోల్ ఇచ్చారు. సొంత ప్రతిభనే నమ్ముకున్న నాకు కాంటాక్ట్స్ లేకపోవడం వల్లే కమర్షియల్ సినిమాలు దూరమయ్యాయి” అని చెప్పుకొచ్చింది తాప్సీ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. 

మరిన్ని వార్తలు