ఆయన లోతుగా అర్థం చేసుకుంటారు!

11-09-2026 | 05:30am

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ‘పాకెట్ నావెల్’ (Pocket Novel) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్యాగరాజ్ కుమారరాజా దర్శకత్వంలో టైలర్ డర్డెన్ అండ్ కినో ఫిస్ట్ బ్యానర్‌పై రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్- కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మోహనన్ ఈ చిత్ర విశేషాలను పంచుకుంది.

ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజాతో పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ తబ్బుబ్బయింది. “త్యాగరాజన్ కుమారరాజాతో కలిసి నేను ‘పాకెట్ నావెల్’ ప్రాజెక్టును పూర్తి చేశాను. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ల కోసం ఆయనను తొలిసారి కలిసినప్పుడు, మిగతా దర్శకులందరితో పోలిస్తే ఆయన ఎంత భిన్నమైనవారో అర్థం చేసుకోవడానికి నాకు కొద్ది నిమిషాలు మాత్రమే పట్టింది.

ఆయన నటీనటులను ఒకేలాంటి పాత్రలో ఇరికించడానికి ప్రయత్నించరు, ప్రతీ విషయాన్ని చాలా శ్రద్ధగా గమనిస్తారు. ఆర్టిస్టులను కేవలం నటీనటులుగా కాకుండా ఒక వ్యక్తిగా లోతుగా అర్థం చేసుకుంటారు. పైపైన కనిపించే విషయాలకంటే.. మన ఆలోచనలు, స్వభావం ఎలా ఉంటాయో గుర్తిస్తారు.

అలాంటి ప్రత్యేకమై న వ్యక్తులు ఇండస్ట్రీలో చాలా అరుదుగా కనిపిస్తారు. త్యాగరాజన్ ఆలోచనా విధా నం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన దృక్పథం ఎంతో అందంగా ఉం టుంది. ఆయనొక అద్భుతమైన క్రియేటర్, తన పని పట్ల ఎంతో అంకితభావం కలిగి ఉం డి అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తారు” అంటూ మాళవిక చెప్పిన ముచ్చట్లు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్‌గా మారాయి. 

మరిన్ని వార్తలు