అనుమతులు లేకుండానే మొక్కజొన్నల తరలింపా?
11-09-2026 | 08:53am
రెండు డీసీఎంలను అడ్డుకున్న లారీ అసోసియేషన్ డ్రైవర్లు
గద్వాల: గద్వాల మండలం కొండపల్లి రోడ్డులోని గ్రామీణుల గిడ్డంగి నుంచి మొక్కజొన్నలను తరలిస్తున్న రెండు డీసీఎం వాహనాలను లారీ అసోసియేషన్ డ్రైవర్లు(Lorry Association drivers) అడ్డుకున్నట్లు తెలిసింది. గోదాం నుంచి నిల్వలను తరలించేందుకు నిబంధనల ప్రకారం అనుమతులు, ప్రక్రియ ఉండాలని డ్రైవర్లు పేర్కొన్నారు. అయితే ఎలాంటి టెండర్లు లేకుండా మొక్కజొన్నలను తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరలింపునకు అనుమతులు ఉన్నాయా? నిబంధనలు పాటించారా? అనే అంశాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.