జన్వాడ ఫాంహౌస్‌ వద్ద హైటెన్షన్

19-09-2026 | 03:05pm

హైదరాబాద్: జన్వాడ(Janwada)లో కేటీఆర్‌ ఫాంహౌస్‌(KTRs farmhouse) సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూముల పరిశీలన కోసం కాంగ్రెస్‌ నేతలు జన్వాడకు చేరుకున్నారు. ఫాంహౌస్‌ పరిసరాల్లోని భూములను పరిశీలించి వివరాలను సేకరించేందుకు నేతలు ప్రయత్నించారు.

ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతలను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రయత్నించడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పలువురు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఫాంహౌస్‌ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఫాంహౌస్‌ భూముల లెక్కలు తేలుస్తామని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. దీంతో జన్వాడలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.





మరిన్ని వార్తలు