21 August, 2026 | 3:30 AM

యూనియన్ బ్యాంక్‌లో హిందీ వర్క్‌షాప్

21-08-2026 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సికింద్రాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో ఉద్యోగుల కోసం ఒకరోజు హిందీ వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రాంతీయ కార్యాలయ పరిధిలోని శాఖల నుంచి ఎంపికైన 38 మంది ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ఆరుగురు అధికారులు, 32 మంది సిబ్బంది ఉన్నారు. వర్క్‌షాప్‌ను రీజనల్ చీఫ్ భాస్కర్ బి ప్రారంభించారు.

బ్యాంకింగ్ రోజువారీ కార్యకలాపాల్లో హిందీ వినియోగాన్ని పెంచాలని, ఖాతాదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక భాషతో పాటు అధికారిక భాషను ప్రోత్సహించాలన్నారు. ఉద్యోగులు స్థానిక భా షను నేర్చుకోవడం అవసరమని పేర్కొన్నారు. అసిస్టెంట్ మేనేజర్ (అధికారిక భాష) రేణుక శాఖలు, కార్యాలయాల్లో అంతర్గత పనులతో పాటు నోటీసులు, ఖాతాదారులకు అందించే సమాచారాన్ని ప్రాంతీయ భాష, హిందీలో ద్విభాషా విధానంలో అందించాల్సిన అవసరాన్ని వివరించారు. రెండో సెషన్ లో ఐఓబీ విశ్రాంత సీనియర్ మేనేజర్ (రాజభాష) ప్రేమ్ కుమార్ అధికారిక భాషా చట్టం-1963, అధికారిక భాషా నియమాలు-1976లోని నిబంధనలను వివరించారు. ఫీల్డ్ హెడ్ భాస్కర్ బి, చీఫ్ మేనేజర్ బి.శ్రీనివాస్ పాల్గొన్నారు.