బదిలీపై వెళ్తున్న అధికారికి ఆత్మీయ సన్మానం
రామగిరి,(విజయ క్రాంతి): రామగుండం ఆర్జి-3 ఏరియా(Ramagundam RG-3 Area)లోని ఎస్ఎంఎస్ ప్లాంట్ నందు ప్రాజెక్ట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ కొత్తగూడెం ఏరియాలోని వికె ఉపరితల గని (ఓసి)కి ప్రాజెక్ట్ ఆఫీసర్ గా బదిలీపై వెళ్తున్న జి.శంకర్ ను రామగుండం ఆర్జి-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్(Sunkara Madhusudan, General Manager, Ramagundam RG-3 Area), వివిధ విభాగాల అధిపతులు మంగళ వారం జిఎం కార్యాలయంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏరియాలో విధేయతతో, అంకిత భావంతో వారు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ఎస్వోటుజియంలు యం.రామ్మోహన్, బండి సత్య నారాయణ, ఏరియా ఇంజినీర్ ఎ.ఉదయ భాస్కర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ జె.రాజశేఖర్, విభాగాధిపతులు బి.టి.మురళీ కృష్ణ, బి.సుదర్శనం, కె.ఐలయ్య , సి.జె.సురేఖ, రవికుమార్, ఆర్.రాజేశ్వరి, ఆసిఫ్ యాసిన్, జ్ఞానసంబంధన్, కోల శ్రీనివాస్, మేఘన,డివై పియం ఎన్. వంశీధర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.