అక్రమంగా పట్టా చేసిన తాసిల్దారుపై చర్య తీసుకోవాలి

08-09-2026 | 10:56pm

ఖానాపూర్,(విజయక్రాంతి): మామడ మండల(Mamada Mandal) కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా భూమిని అక్రమ రిజిస్ట్రేషన్(Illegal registration) చేసిన తాసిల్దార్ శ్రీనివాసరావు పై చర్య తీసుకోవాలని బాధితులు కే.నరేష్ డిమాండ్ చేశారు. మామడ మండల కేంద్రంలో నిషేధిత భూమి 103/1 భూమి రాత్రి సమయంలో అక్రమంగా పట్టా చేసి ఇచ్చారని తెలిపారు.

దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఇప్పటికే కలెక్టర్కు దీనిపై ఫిర్యాదు చేసామని తెలిపారు. భూమిపై వివాదం ఉన్నప్పటికీ కోర్టు లోక్పాల్ ఆదేశాలను ధిక్కరించి అక్రమ పట్టా చేసిన తాసిల్దార్ పై చర్య తీసుకునే వరకు తన న్యాయ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి మహిళా నాయకులు పోసాని మమత రాణి నిర్మల్ నాయకులు వేణు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు