సౌదీలో ఎమర్జెన్సీ.. మోగిన సైరన్లు
సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి
రియాద్: యెమెన్‌లోని ఇరాన్ మద్దతు గల హూతీ(Houthis) మిలిటెంట్లు, సౌదీ రాజధాని రియాద్‌తో పాటు ఆ దేశపు ఎర్ర సముద్ర తీరంలోని ఇంధన కేంద్రాలపై డ్రోన్, బాలిస్టిక్ క్షిపణి దాడులు(Ballistic missile attacks) జరిపినట్లు ప్రకటించారు. రియాద్‌పై ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి దాడులను సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయని అధికారులు తెలిపారు. సౌదీఅరేబియాకు సైనిక మద్దతు ఇవ్వనున్నట్లు తుర్కియే ప్రకటించింది.
అంతకుముందు, సౌదీ రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయం(Saudi International Airport) సమీపంలో ఇంధన ట్యాంకులే టార్గెట్ దాడులు జరిగాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో దట్టంగా పొగ అలుముకుంది. ఎయిర్‌పోర్టు సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. ఈ దాడితో విమాన సర్వీసులకు తాత్కాలికంగా అంతరాయం కలిగింది. ఇప్పటికే సౌదీవ్యాప్తంగా హై అలర్ట్(Saudi on high alert) ప్రకటించారు. హౌతీ తిరుగుబాటుదారులతో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. జూలైలో ఇరాన్ మద్దతు గల హూతీలు సౌదీ అరేబియాపై తమ దాడులను పెంచినప్పటి నుండి, రాజధానిలో మొదటిసారిగా వైమానిక దాడి హెచ్చరికలు మోగాయి. మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికన్లను "అప్రమత్తంగా ఉండాలని, అలాగే విమానాలు రద్దయ్యే లేదా ఇతర ప్రయాణ అంతరాయాలు ఏర్పడే అవకాశాలకు సిద్ధంగా ఉండాలని" అమెరికా విదేశాంగ శాఖ కోరింది.