అదెట్ల చెల్లని సంతకం సారు?
- జేబుకు చిల్లుపడితేనే సంతకం చెల్లుతుంది
పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్ చెల్లదు.
బర్త్ సర్టిఫికెట్ ఖరీదు రూ. 822/-, 2నెలల సమయం
ఇద్దరు గెజిటెడ్ అధికారుల సంతకాలు. కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు
చేవెళ్ళ,సెప్టెంబర్ 17(విజయక్రాంతి): ఇంటి వద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో (Government Hospital) సాధారణ కాన్పులో పుట్టిన బిడ్డలకు కుటుంబ సభ్యు లు గ్రామపంచాయతీలో (Gram Panchayat) బిడ్డల పేరు నమో దు చేస్తారు. ఆ భార్య భర్త ఆధార్, ఆసుపత్రి డిశ్చార్జ్ సమ్మరీ స్థానిక గ్రామపంచాయతీలో సబ్మిట్ చేయగా జి ఓ ఎంఎస్ నెంబర్ 276 పిఆర్ అండ్ ఆర్ డి డిపార్ట్మెంట్ 18/7/ 2002,,జిఓ ఎంఎస్ నెంబర్ 199/పిఆర్ అండ్ ఆర్ డి డిపార్ట్మెంట్ 18/5/2007 ప్ర కారం గ్రామపంచాయతీ కార్యదర్శి బర్త్ స ర్టిఫికెట్ ఇస్తారు.
జనన మరణ నమోదు చ ట్టం 1969, 12/17 ప్రభుత్వా నిబంధనల ప్రకారం వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చిన సర్టిఫికె ట్లతో పంచాయతీ కార్యదర్శి కోడ్ నంబర్స్ క్రియేట్ చేసి నంబర్స్ తో సర్టిఫికెట్ విడుదల చేస్తారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగానే పిల్లలను స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నారు. పంచా యతీ కార్యదర్శి ఇచ్చిన ఈ సర్టిఫికెట్లలో కొన్ని ఆన్లైన్ కూడా చేయగా మరికొన్ని మా న్యువల్ గా ఇచ్చారు. అయితే చేవెళ్ల మున్సి పాలిటీగా ఏర్పడ్డాక పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సంతకం చెల్లదట.
ఈ సర్టిఫికెట్ ఆన్లై న్ లేకపోవడంతో పిల్లల విద్యాభ్యాసానికి తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఈ నేపథ్యంలో మాన్యువల్ సర్టిఫికెట్ తీసుకొని కమిషనర్ వద్దకు వెళ్తున్నారు. తల్లిదండ్రులకు నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ కోసం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిష నర్ చెబుతున్నాడు.
అప్పట్లో పంచా యతీ కార్యదర్శికి ఆస్పత్రిలో డాక్టర్స్ ఇచ్చిన కాన్పు (డెలివరీ) సర్టిఫికెట్, డిశ్చార్జ్ సమ్మరీ మదర్ ఫాదర్ ఆధార్ కారడ్స్ ఆర్డిఓ ఇచ్చిన నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్, సబ్మిట్ చేయగా మ్యానువల్ బర్త్ సర్టిఫికెట్ కమిషనర్ ఆన్లైన్ చేస్తే సరిపోతుంది కదా ఇప్పుడు కొత్త ప్రాసెస్ చేయడం దేనికని ప్రజలు అడుగుతున్నారు.
పంచాయతీ కార్యదర్శి సంతకం చెల్లదా అంటూ.. కొంతమంది తల్లిదండ్రులు కమిషనర్ ను ప్రశ్ని స్తున్నారు. సేమ్ ప్రొసీ డింగ్ అయినప్పటికీ అంకెలు మాత్రమే మారుతున్నాయి. ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి రెండు నెలల టైం పడుతుంది.
ప్రజలకు తప్పని తిప్పలు
నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ కోసం మీ సేవలో మున్సిపల్కు రూ.130/, లేట్ రిజిస్ట్రేషన్ ఫీజు తాసిల్దార్ ఆర్డీవోకు ఏజ్ ని బట్టి చెల్లించాలి. నో డేటా కింద మల్లి మున్సిపల్ కు రూ.170/, చివరగా సర్టిఫికెట్ ఇష్యూ కొరకు మున్సిపల్ కు రూ.112/, పే చేయగా ఇంతకుముందే నోటరీ కోసం రూ.300/ అడ్వకేట్ కు చెల్లించగా ఈ మొత్తం రూ: 822/ ఖర్చుతోపాటు ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు సంతకం. మరియు ఆర్‌ఐ పంచనామాలు ముగ్గురు సాక్షి సంతకాలు అవసరమైతున్నాయి. అయితే ఈ మధ్య కొందరు గెజిటెడ్ సిగ్నేచర్ దుర్వినియోగానికి పాల్పడడంతో గెస్టేట్ చేయడానికి అధికారులు వెనుకడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో చేవెళ్ల తహసిల్దార్ కార్యాలయంలో నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ ఇవ్వడం మానేశారు. కోర్టు ఆర్డర్ ప్రకారం రెండు సంవత్సరాలు దాటితే బర్త్ సర్టిఫికెట్ కోర్టు ద్వారా తీసుకోవాలని తాసిల్దార్ చెప్తున్నారు.
ఈ దుస్థితి ఎందుకు సార్ ఓ ఫాదర్ ఆవేదన
పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన భర్త సర్టిఫికెట్ మునిసిపల్ అధికారులు ఆన్లైన్ చేసి సరిపోతుంది . అంతేకానీ ఆ అధికారి ఇచ్చిన సర్టిఫికెట్ అనడం మంచి పద్ధతి కాదు. ఈ అధికారుల సమన్వయ లోపం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చేవెళ్ల మున్సిపల్ ఊరెళ్ళ గ్రామానికి చెందిన మహమ్మద్ అలీమ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా మునిసిపల్ అధికారులు స్పందించి గ్రామపంచాయతీ అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్లని ఆన్లైన్ చేసి ఇవ్వాలని కోరుతున్నారు. నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ తహసిల్దార్ ఇవ్వకపోతే సాధారణ ప్రజలు తమ బిడ్డలకు బర్త్ సర్టిఫికెట్ కోర్టు ద్వారా పొందే దుస్థితి ఎందుకు. అయితే ఈ జరుగుతున్నతంగంపై అధికారులపై పిర్యాదు ఇవ్వడానికి ముందుకు రావడం లేరు.