26 August, 2026 | 3:44 AM

సతుల స్థానంలో పతులు.. సర్పంచ్‌లపై పెత్తనం?

26-08-2026 12:07 AM
  1. మహిళా సర్పంచ్ల వెనుక భర్తల హవా.. 
  2. పాలన ఎవరి చేతుల్లో?

కౌటాల, ఆగస్టు 25 (విజయక్రాంతి): మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యం క ల్పించడంతో పాటు, వారు పాలనలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో స్థానిక సం స్థల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అయి తే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందు కు భిన్నంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కౌటాల మండలంలోని కొన్ని గ్రా మ పంచాయతీల్లో మహిళలు సర్పంచ్లుగా ఎన్నికైనా.. వారి స్థానంలో భర్తలు పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.

 భార్యలు సర్పంచ్‌లు.. పెత్తనం భర్తలది...

గ్రామ పంచాయతీ సమావేశాలు, అభివృద్ధి పనులు, అధికారులతో సంప్రదింపులు తదితర వ్యవహారాల్లో కొందరు మహి ళా సర్పంచ్ల భర్తలే ముందుండి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

దీంతో ప్రజ లు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఎన్నికైన సర్పంచ్లను కలవాలా? లేక వారి భర్తల ను ఆశ్రయించాలా? అనే పరిస్థితి నెలకొందని పలువురు గ్రామస్తులు అంటున్నారు.

మహిళా సాధికారతకు విఘాతమేనా?

మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించి నాయకత్వ లక్షణాలను పెంపొందించాల్సిన సమయంలో.. వారి అధికారాలను కుటుంబ సభ్యులు వినియోగిస్తే రిజర్వేషన్ల అసలు లక్ష్యమే దెబ్బతింటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా అధికారులు అవగాహన కల్పించడంతో పాటు, వారికి అవసరమైన సహ కారం అందించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

అధికారులు దృష్టి సారించాలి...

గ్రామ పంచాయతీ పరిపాలనలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాత్ర స్పష్టంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సర్పంచ్ల అధికారాలను ఇతరులు వినియోగించకుండా పంచా యతీరాజ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఎన్నికల్లో సతులు.. 

పాలనలో పతులు అనే చర్చకు కౌటాల మండలంలోని పరిస్థితులు తావిస్తున్నాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా యి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.