జాతీయ స్థాయి కరాటే పోటీల్లో హుజురాబాద్ విద్యార్థుల సత్తా

27-09-2026 | 08:41pm

హుజురాబాద్, సెప్టెంబర్27: (విజయక్రాంతి) : ఆగ్రా గార్డెన్స్, భట్టుపల్లి సమీపంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో(Central University) నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌లో(National level Karate Championship) కరీంనగర్ జిల్లా హుజురాబాద్ GSKDI కరాటే అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు పతకాలు సాధించినట్లుకరాటే మాస్టర్ ఎస్కే జలీల్ ఆదివారం తెలిపారు. ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో సదుల్లా బాబా, భానుతేజ, సాయి చరణ్, హుమేరా తస్లీమ్, వినూత్న, సాక్షిత్, హేమ, సాయి అనుకైత, ఎస్‌కే గౌసియా ఫాతిమా తదితరులు కటాస్, స్పారింగ్ విభాగాల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించారు.

విజేతలను తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ కరీంనగర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, రిటైర్డ్ పీటీ రాజిరెడ్డి, 17వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖలీద్ హుస్సేన్, మాజీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, న్యూ కాకతీయ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ బి. రాజ్‌కుమార్, ప్రిన్సిపాల్ వెంగళరావు, డైరెక్టర్ గోపాల్ తదితరులు అభినందించారు.

మరిన్ని వార్తలు