నా కథేనా అనుకున్నా!
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా యువ దర్శకుడు ఆదిత్య హాసన్ (Aditya Hasan) తెరకెక్కించిన తాజాచిత్రం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. సెప్టెంబర్ 11న రిలీజ్ అవుతున్న ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు హీరో ఆనంద్.
వనపర్తికి చెందిన ఒక సాధారణ కుర్రాడు, తన ప్యాషన్‌ను పక్కన పెట్టి, తల్లిదండ్రుల కోసం విదేశాలకు వెళ్తాడు. అక్కడ నుంచి అతను జీవితాన్ని చూసే కోణం ఎలా మారుతుంది? అక్కడ ఒకమ్మాయిని ప్రేమించి, లివిన్ రిలేషన్(Live-in relationship)లో ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది సహజంగా చూపించాం. లివిన్ రిలేషన్ కాన్సెప్ట్ అయినప్పటికీ, కుటుంబ ప్రేక్షకుల(Family audiences)కు ఎక్కడా ఇబ్బంది కలగకుండా దర్శకుడు ఆదిత్య(Director Aditya) ఎంతో అందంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు.
ఆదిత్య పాత్రలో నన్ను నేను నూటికి నూరు శాతం చూసుకున్నా. కథ వింటున్నప్పుడే ఇదేంటి నా కథలాగే ఉంది అనుకున్నా. విదేశాల్లో చదువుకుంటున్న తెలుగువారంతా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి సన్నివేశం, ప్రతి సంభాషణ హత్తుకునేలా ఉంటాయి. ‘బేబీ’ అంత పెద్ద విజయం సాధించింది కాబట్టి.. నేను, -వైష్ణవి కలిసి నటిస్తున్నప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడటం సహజమే. అయితే ‘బేబీ’కి, ‘ఎపిక్’ సినిమాకూ పోలిక లేదు. రెండూ దేనికవే ప్రత్యేకమైనవి.
బేబీ ఒక సంచలనమైతే, ఇది ఒక అందమైన ప్రయాణం లాంటిది. నేను, -వైష్ణవి కలిసి నటించినప్పటికీ బేబీ గురించి ఎంత మాట్లాడుతున్నారో.. 90s వెబ్ సిరీస్ గురించి, ఆదిత్య హాసన్ గురించి కూడా అదే స్థాయిలో మాట్లాడుతున్నారు. అది సినిమాకు కలిసివచ్చే అంశమే! నా తదుపరి చిత్రాలు గురించి..- ‘తక్షకుడు’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఒక ఇండో-కొరియన్ మూవీ కూడా పూర్తి చేశా.
* 80స్, 90స్, 2000స్.. ఇలా అన్ని జనరేషన్ల వారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లిన వారికి మాత్రమే కాకుండా, కుటుంబానికి దూరంగా ఉండే ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఒక మధ్య తరగతి యువకుడి జీవితంలో చిన్న చిన్న విషయాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి కథ.
* నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటలను మనం అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటుందో ఈ మూవీ అలా ఉంటుంది. ప్రేమ, కుటుంబం, బాధ్యతలు.. ఇలా ఇందులోని ప్రతి అంశం గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. ఇది రెగ్యులర్ మూవీలా కాకుండా అందమైన జర్నీలా ఉంటుంది.
* వైష్ణవి చైతన్య పోషించిన కడలి పాత్ర ప్రతి అమ్మాయికీ కనెక్ట్ అవుతుంది. ఒక అమ్మాయి పైకి నవ్వుతూ కనిపిస్తున్నంత మాత్రాన, తను సంతోషంగా ఉందని కాదు. ఆమె వెనుక భయాలు, బాధ్యతలు ఉంటాయి. అలాంటి పాత్ర కడలి.
* మా వదిన రష్మిక, నేనూ సినిమాల గురించి పెద్దగా మాట్లాడుకోం. కానీ, ఎపిక్ ఎప్పుడు విడుదల చేయాలని రిలీజ్ డేట్ కోసం కొంచెం టెన్షన్ పడుతున్న సమయంలో.. వదిన నాకు మెంటల్‌గా సపోర్ట్‌గా నిలబడ్డారు.