సిఎంసీ ఆదేశాలు బేఖాతర్

01-10-2026 | 12:12am

జీపీఆర్ లేఅవుట్ లో భారీ అక్రమ నిర్మాణం

అక్రమ నిర్మాణం పై చర్యలు లేనట్టేనా..?

ముడుపులకే ప్రాధ్యాన్యం... అక్రమ నిర్మాణంపై చర్యలు శూన్యం

నిజాంపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ పై స్థానికుల అనుమానాలు

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): నిజాంపేట్ సర్కిల్(Nizampet Circle) పరిధిలోని అక్రమ నిర్మాణాల(Illegal Construction)పై చర్యలు కాగితలకే పరిమితమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.భవన నిర్మాణ అనుమతులు,నిబంధనలు, సెట్ బ్యాక్ నిబంధనలు పక్కకు పెట్టి నిర్మాణదారులు తమ ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు వస్తున్నప్పటికి నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు.

నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని జీపీఆర్ లేఅవుట్ లో ఓ నిర్మాణదారుడు భవన నిర్మాణానికి జీ+2 అనుమతులు తీసుకొని నిబంధనలను ఉల్లంఘించి ఏకంగా జీ+5,పెంట్ హౌస్ అలాగే కమర్షియల్ షెటర్స్, కనీసం సెట్ బ్యాక్ లేకుండా భవనం నిర్మిస్తున్నాడు. నిబంధనలు పాటించకుండా, చట్టాలను తుంగలో తొక్కుతూ నిర్మాణదారుడి ఇష్టానుసారంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఎంత వరకు సమంజసమని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే సదరు అక్రమ నిర్మాణంపై సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేస్తునప్పటికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తున్నప్పటికి చర్యలు తీసుకోకపోవడంపై టౌన్ ప్లానింగ్ అధికారులపై స్థానికులలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ముడుపులకే ప్రాధాన్యం... అక్రమ నిర్మాణాలపై చర్యలు శూన్యం

అయితే సదరు నిర్మాణదారుడి నుండి టౌన్ ప్లానింగ్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టాయనే ఆరోపణలు స్థానికుల నుండి వ్యక్తం అవుతున్నాయి. అక్రమ నిర్మాణంపై పలు ఫిర్యాదులు వస్తున్నప్పటికి చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. సిఎంసీ కమిషనర్ సిఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కిల్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికి అవేమి పట్టించుకోకుండా నిర్మాణదారులతో కుమ్మక్కై లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే నోటీసుల జారీ చేసి భారీగా సెటిల్మెంట్ల్ చేసుకొని నిర్మాణదారులకు సహకరిస్తున్నారని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా సిఎంసీ కమిషనర్ కలుగజేసుకొని అక్రమ నిర్మాణాలకు సహరిస్తున్న అధికారులపై, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు