కురుమూర్తి దేవాదాయ భూమిలో అక్రమ తవ్వకాలు

01-10-2026 | 05:05am

సర్వే పూర్తయ్యే వరకు జేసీబీ పనులు నిలుపాలని అధికారుల ఆదేశం

చిన్నచింతకుంట, సెప్టెంబర్ 30: ప్రసిద్ధ కురుమూర్తి దేవస్థానం(Kurumurthy Temple) పరిధిలోని మాండ్రాలా వద్ద దేవాదాయ, ప్రైవేటు పట్టా భూముల సరిహద్దు వివాదం నెలకొంది. దేవాదాయ భూమిలో అధికారిక సర్వే పూర్తికాకముందే జేసీబీలతో బండరాళ్లు, చెట్లను తొలగించి చదును పనులు చేపట్టడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

మాండ్రాలా రోడ్డు సమీపంలో కొంత భాగం ప్రైవేటు పట్టా భూమి, మరికొంత భాగం కురుమూర్తి దేవస్థానానికి చెందిన దేవాదాయ భూమిగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అయితే భూముల హద్దులు నిర్ధారించకుండానే ఎలాంటి అనుమతులు లేకుండా పనులు చేపడుతున్న విషయాన్ని స్థానిక విలేకరి శివకుమార్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హద్దులు నిర్ధారించకుండా పనులు కొనసాగించడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తుండ్రు. 

వెంటనే హద్దులు కేటాయించాలని డిమాండ్..

ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం లేకుండా వెంటనే హద్దులు నిర్ణయించేలా సర్వే చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాతకాలికంగా పనులు ఆపినప్పటికీ హద్దులు పూర్తిస్థాయిలో తేల్చి దేవాలయానికి సంబంధించిన భూములను పూర్తిస్థాయిలో సంరక్షించాలని ఇటు ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఇబ్బందులు కలగకుండా వారికి ఉన్న భూమిని కూడా చూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ విషయంపై అధికారులు తాత్కాలికంగా పనులు నేర్పినప్పటికీ హద్దులు కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తుండ్రు.

హద్దులు కేటాయిస్తాం.. సర్వే చేయిస్తాం..

వివాదాస్పద భూమిపై ఇంకా అధికారిక సర్వే పూర్తి కాలేదని తెలిపారు. పనులకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. దేవాదాయ, పట్టా భూముల హద్దులు తేలే వరకు ఎలాంటి తవ్వకాలు, చదును పనులు చేపట్టరాదని, వెంటనే పనులు నిలిపివేయాలని సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇబ్బందులు లేకుండా పూర్తి శైలహద్దులు కేటాయించడం జరుగుతుంది.

 ఆర్‌ఐ తిరుపతయ్య, 

చిన్న చింత కుంట, మహబూబ్ నగర్

మరిన్ని వార్తలు