రెడ్డీస్ యూత్ ఆధ్వర్యంలో నిమజ్జనం వేడుకలు
23-09-2026 | 08:56pm
మల్లాపూర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో రెడ్డీస్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం నిమజ్జన కార్యక్రమం(Immersion festivities) చేపట్టారు. మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తుల్లో కోలాటాలు, నృత్యాలతో పాల్గొని వినాయకుడికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాల విజయవంతానికి రెడ్డీస్ యూత్ సభ్యులు ఏర్పాట్లు చేశారు.