గణప సముద్రంలో 75 గణపతి విగ్రహాల నిమజ్జనం
25-09-2026 | 02:45pm
గణపురం, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): గణపతి నవరాత్రుల(Ganpati Navratri) అనంతరం గణప సముద్రం సరస్సు లో గణపతి విగ్రహాలను బుధ గురువారాల్లో ప్రశాంతంగా నిమజ్జనం కార్యక్రమం పూపూర్తయింది.గణపురం మండలం తో పాటు వివిధ మండలాల నుండి వచ్చిన 75 విగ్రహాలను సరస్సులో నిమజ్జనం చేశారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కాళేశ్వరం, గణప సముద్రం సరస్సు ల వద్ద మాత్రమే నిమజ్జనం స్పాట్ లను అధికారులు ఏర్పాటు చేశారు.
రెండు రోజులపాటు కొనసాగిన నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. గణపురం సిఐ కరుణాకర్ రావు, తాసిల్దార్ అడ్లూరి రాజేశ్వరరావు, ఎస్ఐ బొరగల అశోక్,ఎంపీడీవో శ్రీకాంత్, గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, బుర్రకాయల గూడెం సర్పంచ్ తుమ్మల సంపత్, ల ఆధ్వర్యంలో సింగరేణి రెస్క్యూ టీం, ఫైర్ సిబ్బంది, నిమజ్జనం వద్ద సేవలందించారు.