దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు బాధాకరం

09-09-2026 | 09:43am

మాల మహానాడు మండల అధ్యక్షుడు కరకపల్లి సుధాకర్‌

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): దళిత స్పీకర్(Dalit Speaker) పై ఉచిత వ్యాఖ్యలు మాల మహానాడు మండల అధ్యక్షుడు కరకపల్లి సుధాకర్ అన్నారు. మండల కేంద్రంలో మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... ఎమ్మెల్సీ తాతా మధు శాసనసభ ప్రాంగణంలో ఉండి స్పీకర్ గడ్డం ప్రసాద్(Speaker Gaddam Prasad)పై అణుచేత వ్యాఖ్యలు చేస్తుంది దళితులను అవమానపరిచారని,ఇది స్పీకర్‌ను అవమానించడం మాత్రమే కాదని.. అంబేద్కర్‌ ఆశయాలను, దళిత సమాజాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు(BRS MLC Thatha Madhu) చేసిన  అనుచిత వ్యాఖ్యలను దళిత సమాజం తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు.

అణగారిన వర్గాల నుంచి ఎదిగి అత్యున్నతమైన శాసనసభ స్పీకర్‌ పీఠాన్ని అధిరోహించిన దళిత ప్రజాప్రతినిధిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌పై చేసిన వ్యాఖ్యల వెనకకు తీసుకుంటూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేనియెడల మాల మహానాడు దళిత సంఘాల(Mahanadu Dalit organizations) ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.  ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ నాయకత్వం కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి వ్యాఖ్యలు, చర్యలను సహించేది లేదని, రాబోయే రోజుల్లో దళితులంతా ఐక్యంగా ఉద్యమిస్తామని  హెచ్చరించారు.

మరిన్ని వార్తలు