20 August, 2026 | 2:48 PM

జూరాల ప్రాజెక్ట్‌కు పెరిగిన వరద ఉద్ధృతి

20-08-2026 01:05 PM

10 గేట్లు ఎత్తివేత.. దిగువకు 41,540 క్యూసెక్కుల నీటి విడుదల

గద్వాల , ఆగస్టు 20 (విజయక్రాంతి): ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రాజెక్ట్‌లోకి 80,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ప్రవాహం పెరగడంతో గురువారం ఉదయం 10 గేట్లను ఎత్తి 41,540 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదే సమయంలో పవర్‌హౌస్‌లో విద్యుత్‌ ఉత్పత్తి చేపడుతూ మరో 41,054 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాల ప్రాజెక్ట్‌ నుంచి మొత్తం 82,594 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.