ఆండాళ్ అమ్మవారికి ఊoజల్ సేవ

11-09-2026 | 10:43pm

స్వామివారి నిత్య రాబడి  19,70,583/-

శ్రావణమాసం స్వామివారికి పెరిగిన  ఆదాయం

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి(Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy) వారి ఆలయంలో స్వామివారికి నిత్య పూజ కైంకర్యాలను వైభవంగా నిర్వహించారు. స్వామి వారిని భక్తులు దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. శ్రీ స్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అమ్మవారిని ప్రధాన ఆలయం నందు అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవంను వైభవంగా నిర్వహించారు. శ్రావణమాసంలో గ తేడాది కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి గత సంవత్సరం 10,27,06,792/- కోట్ల  ఆదాయం రాగా ఈ సంవత్సరం 12,69,50,890/- కోట్ల ఆదాయం   వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు