చెలరేగిన యువ స్పిన్నర్ తన్మయ్
ఆసీస్ అండర్ 19 జట్టు 174 ఆలౌట్
అహ్మదాబాద్, అక్టోబర్ 5 : భారత్ అం డర్ 19 జట్టు(India Under-19 team) మరోసారి అదరగొట్టింది. ఆసీస్ అండర్ 19 జట్టుతో(Aussie Under-19 team) జరుగుతున్న ప్రారంభమైన రెండో అనధికారిక టెస్టులో తొలి రోజు పైచేయి సాధించింది. కంగారూలను 174 పరుగులకే కుప్పకూల్చింది. భారత్ టా స్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, బౌల ర్లు సత్తా చాటారు. ముఖ్యంగా స్పిన్నర్ తన్మయ్ బలోడా(Spinner Tanmay Baloda) ధాటికి కంగారూ బ్యాటర్లు క్రీ జులో నిలవలేకపోయారు. తన్మయ్ ఆరు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు.
అతనితో పాటు అయాన్ అక్రమ్, మోహిత్ ఉల్వా, ప్రియాన్షు సింగ్ కూడా రాణించారు. ఆసీస్ ఇన్నింగ్స్లో 37 పరుగులు చేసిన చార్లీ హెండర్సన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నీల్ పటేల్ (31), జేకబ్ పీట్జ్ (26), ప్యాట్రిక్ సుల్లివాన్ (20), థామస్ వసియో (14) రెండంకెల స్కోర్లు చేశారు. తొలి ఇన్నింగ్స్ ప్రారం భించిన భారత్ 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో, ఓపెనర్ లక్ష్య రాజేశ్ ఒక్క పరుగుకే ఔటవగా, మరో ఓపెనర్ సాగర్ విర్క్ 16 పరుగుకే వెనుదిరిగాడు. భారత్ ఇంకా 136 పరుగులు వెనుకబడి ఉంది.తొలి రోజు ఆట ముగిసే సమయానికి కుషాగ్రా ఓఝా 13, కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.