ఫైనల్లో భారత్

11-09-2026 | 05:45am

బంగ్లాదేశ్‌పై ఘన విజయం

అదరగొట్టిన షెఫాలీ వర్మ

మహిళల ఆసియా కప్

పాక్, లంక మ్యాచ్ విజేతతో టైటిల్ పోరు

మహిళల ఆసియా కప్ టైటిల్‌కు భారత్ అడుగు దూరంలో నిలిచింది. తన దూకుడు కొనసాగిస్తూ సెమీ ఫైనల్లో బంగ్లాను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో స్మృతి విఫలమైనా, షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. తర్వాత బౌలింగ్‌లో దీప్తి శర్మ, ఇతర స్పిన్నర్లు కలిసి కట్టుగా రాణించి బంగ్లాను కట్టడి చేశారు. పాక్, శ్రీలంక మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో భారత్ టైటిల్ కోసం తలపడనుంది.

దుబాయి, సెప్టెంబర్ 10: ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. స్టార్ ప్లేయర్, ఓపెనర్ స్మృతి మంధన(Smriti Mandhana) (2) త్వరగా ఔటైనా, మరో ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma) (40 బంతుల్లో 64 (7 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగింది.

ఈ క్రమంలో అరుదైన ఘనత సాధించింది. మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచింది. స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, జెమీ మా రోడ్రిగ్స్, రిచా ఘోష్లను షెఫాలీ వర్మ వెనక్కినెట్టింది. ఇప్పటి వరకు మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీలో 20 ఇన్నింగ్స్‌లు ఆడిన షెఫాలీ వర్మ 593 పరుగులు చేసింది.

18 ఇన్నింగ్సోలో స్మృతి మంధాన 590, హర్మన్ప్రీత్ కౌర్ 465, జెమీ రోడ్రిగ్స్ 345 పరుగులు చే శాడు. 17 ఇన్నింగ్స్‌లో రిచా ఘోష్ 231 పరుగులు చేసిం ది. మిగతా ప్లేయర్లలో ప్ర తీకా రావల్ 20 (24 బం తుల్లో ఫోర్, సిక్స ర్), కెప్టెన్ హర్మన్ప్రీత్ 24  (నాటౌట్), రిచా ఘోష్ 21 (16 బంతు ల్లో 2 సిక్సర్లు), దీప్తి శర్మ 13 (6 బంతుల్లో ఫోర్, సిక్సర్) పరుగులు చేశారు.

బంగ్లాదేశ్ బౌలర్లలో సుల్తాన ఖాటున్ రెండు వికెట్లు తీయగా.. మరుఫా అక్తర్, నహిదా అక్తర్, రబెయా ఖాన్ తలో వికెట్ తీసారు. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది. ఓపెనర్లు దిలారా, ఫిర్డస్ తొలి వికెట్ కు 26 పరుగులు జోడించారు. భారత్ స్పిన్నర్ల ఎంట్రీతో సీన్ మారిపోయింది. దీప్తి శర్మ కీలక సమయాల్లో వికెట్లు తీసి బంగ్లాను దెబ్బకొట్టింది. తెలుగమ్మాయి శ్రీ చరణి, మరో స్పిన్నర్ ప్రేమా రావత్ కూడా రాణించడంతో బంగ్లా చేతుల్తేసింది.  

స్కోరు బోర్డు 

భారత్ మహిళల ఇన్నింగ్స్ : 149/6 (షెఫాలీ వర్మ 64, హర్మన్ ప్రీత్ 24 , రిచా ఘోష్ 21, ప్రతీకా రావల్ 20, సుల్తానా 2/30 )

బంగ్లా మహిళల ఇన్నింగ్స్ : 109/7 ( షోర్నా 22, దిలారా 21, సుల్తానా 19, దీప్తి శర్మ 3/26, నందిని శర్మ  2/10 )

మరిన్ని వార్తలు