శ్రీలంకతో సెమీస్ సమరం

01-10-2026 | 05:00am

నిస్సాన్, సెప్టెంబర్ 30: ఆసియా క్రీడ(Asian Games)ల్లో భారత క్రికెట్(TeamIndia) జట్టు కీలక పోరుకు సిద్ధమయింది. గురువారం శ్రీలంకతో సెమీ ఫైనల్‌లో తలపడనుంది. వర్షాల కారణంగా మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్స్‌తో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఫైనల్ చేరాయి. మరో సెమీస్‌లో పాక్, బంగ్లా తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండా సెమీఫైనల్ మ్యాచ్‌లు కూడా రద్దయితే.. మెరుగైన ర్యాంకులు కలిగిన జట్లు ఫైనల్ చేరుతాయి.

ఈ లెక్కన భారత్, పాకిస్థాన్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. టీ20ల్లో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్థాన్ 6వ, బంగ్లాదేశ్ 8వ, శ్రీలంక 9వ స్థానంలో కొనసాగుతున్నాయి. చైనాలో హాంగ్జౌ వేదికగా జరిగిన గత ఆసియా గేమ్సలోనూ వర్షం మ్యాచ్‌లకు అంతరాయం కలిగించగా.. మెరుగైన ర్యాంక్ కలిగిన భారత్‌కు స్వర్ణ పతకం వరించింది. ఈ సారి కూడా అదే తరహా ఫలితం రిపీట్ అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 3న ఫైనల్ జరగనుండగా.. అదే రోజు కాంస్య పోరు కూడా జరగనుంది.

మరిన్ని వార్తలు