WhatsAppలో కొత్త రూల్స్

01-10-2026 | 10:33am

WhatsAppలో టీనేజర్ల ఖాతాలకు సంబంధించి భారీ మార్పు(WhatsApp New Update) వచ్చింది. ఇక తల్లిదండ్రులు తమ పిల్లలు మెసేజింగ్ యాప్‌ను ఎలా ఉపయోగిస్తున్నారనే విషయంలో మరిన్ని నియంత్రణలు పెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త వ్యవస్థలోనూ వ్యక్తిగత Chats, Calls మాత్రం తల్లిదండ్రులకు కనిపించవు. WhatsApp తీసుకొచ్చిన ఈ కొత్త Parental Controls పూర్తిగా Optionalగా ఉంటాయి.

ఒక్క PINతో కీలక సెట్టింగ్స్‌కు లాక్

తల్లిదండ్రులు, టీనేజర్లు(WhatsApp Teen Accounts) కలిసి Privacy Settingsను సెట్ చేసుకోవచ్చు. టీనేజర్ Profile Photoను ఎవరు చూడాలి? ఎవరు వారిని WhatsApp Groupsలో యాడ్ చేయాలి? వంటి అంశాలపై పేరెంట్స్ నియంత్రణలు పెట్టవచ్చు. ఒకసారి పరిమితులు పెట్టిన తర్వాత వాటిని సడలించాలంటే Parent Set PIN ద్వారా అనుమతి అవసరం అవుతుంది.

గ్రూప్‌లో చిన్న మార్పు జరిగినా అలర్ట్

కొత్త అప్‌డేట్‌లో Group Activityపై కూడా తల్లిదండ్రులకు సమాచారం అందుతుంది. టీనేజర్ కొత్త గ్రూప్‌లో చేరినా, ఏదైనా గ్రూప్ నుంచి బయటకు వచ్చినా పేరెంట్స్‌కు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే టీనేజర్ ఉన్న గ్రూప్‌లో సభ్యుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పుడు కూడా అలర్ట్ అందుతుంది.

Status, Channelsపైనా కంట్రోల్

WhatsApp Channels, Status విషయంలోనూ తల్లిదండ్రులకు కొత్త ఆప్షన్లు వచ్చాయి. టీనేజర్లు ఏ Channels చూడాలి, Channelsను క్రియేట్ చేయడానికి అనుమతి ఇవ్వాలా, ఎవరి Statusను వారు చూడాలి, వారి Statusను ఎవరు చూడాలి వంటి Privacy Settingsను పేరెంట్స్ నిర్వహించవచ్చు.

Meta AIపై కూడా పేరెంట్స్ నిర్ణయం

ఈ అప్‌డేట్‌లో Meta AI కూడా కీలకంగా మారింది. టీనేజర్ల కోసం సాధారణ 13+ అనుభవాన్ని కొనసాగించాలా లేదా మరింత పరిమితమైన “Limited Content” ఆప్షన్‌ను ఎంచుకోవాలా అనేది తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు. Limited ఆప్షన్‌లో Meta AIతో చర్చించగల అంశాలపై మరిన్ని పరిమితులు ఉంటాయి.

కానీ పిల్లల Chats మాత్రం చూడలేరు

కొత్త Parental Controls వచ్చినా టీనేజర్ల వ్యక్తిగత Messages, Callsపై తల్లిదండ్రులకు యాక్సెస్ ఉండదు. WhatsApp ప్రకారం వ్యక్తిగత సంభాషణలు End-to-End Encryptionతో రక్షించబడతాయి. అంటే ఆ సంభాషణలను WhatsApp కూడా చదవడం లేదా వినడం చేయలేదని సంస్థ తెలిపింది.

కుటుంబాలకు నచ్చినట్లు మార్చుకునే అవకాశం

ఈ Parental Controlsను ప్రతి కుటుంబం తమ అవసరానికి అనుగుణంగా సెట్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులు ఎప్పుడైనా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు లేదా వాటిని పూర్తిగా ఆఫ్ చేయవచ్చు. కుటుంబాల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని Safety Tools తీసుకురావాలని WhatsApp చెబుతోంది. మొత్తానికి.. పిల్లల వ్యక్తిగత Chatsలోకి వెళ్లకుండా వారి WhatsApp వినియోగంపై తల్లిదండ్రులకు మరింత అవగాహన, నియంత్రణ కల్పించే దిశగా ఈ కొత్త ఫీచర్లు తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు