ఆసియా క్రీడల్లో భారత్ బోణీ.. షూటింగ్లో రజతం
20-09-2026 | 10:06am
Asian Games: నాగోయా: ఐచి-నాగోయా ఆసియా క్రీడలలో భారత్ తన షూటింగ్(Air Rifle Team Event) పోరును ఘనంగా ప్రారంభించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్ రజత పతకాన్ని గెలుచుకుంది. ఎలావెనిల్ వలరివన్, సోనమ్ మస్కర్, విదర్శ వినోద్ కలిసి మొత్తం 1898.0 పాయింట్లు సాధించి, 1904.2 పాయింట్ల ప్రపంచ రికార్డు స్కోరుతో అగ్రస్థానంలో నిలిచిన చైనా తర్వాతి స్థానంలో (రెండవ స్థానంలో) నిలిచారు. ఆతిథ్య దేశమైన జపాన్ 1897.1 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచింది.