హైదరాబాద్‌లో వర్షం

20-09-2026 | 10:21am

హైదరాబాద్: తెలంగాణలోని(Telangana Rains) పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి హైదరాబాద్(Hyderabad) లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్ పేట్, రాయదుర్గం, మణికొండ, ఫిలింనగర్, యూసూఫ్ గూడ, మాదాపూర్, గచ్చిబౌలి, షేక్ పేట్, టోలిచౌకి, మెహదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో జోరు వాన కురుస్తుంది. రాబోయే గంటలో మధ్య, ఉత్తర హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, మాదాపూర్, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, బాలానగర్, మేడ్చల్, షామీర్‌పేట్, పరిసర ప్రాంతాలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు