44 ఏళ్ల నిరీక్షణకు తెర
* భారత హాకీలో మరో చారిత్రక విజయం నమోదైంది. ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ(Indian Women's Hockey) జట్టు చరిత్ర సృష్టించింది. సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బంగారు పతకాన్ని ముద్దాడింది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాకు చెక్ పెట్టి 1982 తర్వాత స్వర్ణాన్ని అందుకుంది. అంతేకాదు ఈ విజయంతో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ బెర్తును ఖాయం చేసుకుంది.
- ఆసియా క్రీడల హాకీలో భారత అమ్మాయిల సంచలనం
- చైనాను ఓడించి స్వర్ణం కైవసం
- లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అర్హత
కాకామిఘారా, అక్టోబర్ 2 : ఆసియా క్రీడల(Asian Games) హాకీలో భారత మహిళల జట్టు(Indian women's team) అదరగొట్టింది. చైనాకు చెక్ పెట్టి చారిత్రక విజ యంతో 44 ఏళ్ల తర్వాత స్వర్ణం సాధించిం ది. ఈ పోటీల ఆరంభం నుంచీ అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న మన అమ్మాయిలు తుది పోరులోనూ చెలరేగారు. ఆరం భంలో చైనా ఎటాకింగ్ గేమ్ ఆడినా భారత్ వారి జోరుకు బ్రేక్ వేసింది. మ్యాచ్ ప్రారంభమైన 10వ నిమిషంలోనే భారత ఫార్వర్డ్ ప్లేయర్ లాల్రెమ్సియామి హమర్జోటే ఆధిక్యాన్ని అందించింది. సలిమా తేటి అందిం చిన చక్కని పాస్‌ను ఆమె అద్భుతమైన రివర్స్ హిట్‌తో చైనా గోల్‌కీపర్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గోల్‌గా మలిచింది.
ఇక్కడ నుంచీ చైనా పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయి ఒత్తిడికి లోనైంది. ఒకదశ లో చైనా గోల్ కొట్టి స్కోరు సమం చేసేదే. కానీ భారత గోల్ కీపర్ సవితా పునియా సూపర్ సేవ్ ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ చాలా వ్యూహాత్మకంగా ఆడింది. ఆధిక్యాన్ని నిలుపుకోవడంపైనే దృష్టి పెట్టింది. కట్టుదిట్టమైన డిఫెన్స్‌తో చైనాను ఒత్తిడిలోకి నెట్టింది.
మ్యాచ్ పొడవునా చైనా జట్టు గోల్ సమం చేయడం కోసం విపరీతంగా దాడులు చేసిం ది. వారికి ఏ కంగా 5 పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ, భారత డిఫెన్స్ అడ్డుకుంది. మన అ మ్మాయిలు అత్యంత క్రమశిక్షణతో ఆడి విజయాన్ని ఖా యం చేసుకున్నారు. భారత మహిళల హాకీ జట్టు చివరిసారిగా 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలవగా, మళ్లీ ఇన్నాళ్లకు పసిడి గెలిచారు.
సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు
ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత మహిళల హాకీ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. 44 ఏళ్ల తర్వాత దేశానికి బంగారు పతకం అందించి గొప్ప విషయమని కొనియాడారు. మహిళల జట్టు ధృఢ సంకల్పంతో ఆడిన తీరు అద్భుతమని ప్రశంసించారు. భారత మహిళల హాకీ జట్టు సాధించిన ఈ విజయం ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూ ర్తినిస్తుందని సీఎం వ్యాఖ్యానించారు.