ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ 109 వ సదస్సు ప్రతి ఆవిష్కరణ

30-09-2026 | 04:25pm

ముకరంపుర, సెప్టెంబర్ 30(విజయ క్రాంతి): భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మమైన ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ (Indian Economic Association)109వ వార్షిక సదస్సు ప్రతిని ఈరోజు శాతవాహన ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య . పి. సతీష్ కుమార్ తో కలిసి, అర్థశాస్త్రసదస్సు లోకల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, కాకతీయ ఆచార్యులు సురేష్ లాల్, శాతవాహన అర్థశాస్త్ర విభాగపు అధిపతి, అసోసియేషన్ తెలంగాణ కార్యనిర్వాక సభ్యురాలు డా. శ్రీవాణి, డీన్ ఫ్యాకల్టీ సోషల్ సైన్స్ ఆచార్య వరప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య బి . సురేష్ లాల్ మాట్లాడుతూ ఈ  సదస్సు 2026, డిసెంబర్ 27, 28, 29 తేదీలలో కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, హాజరయ్యే వారు ఐఇఎ వెబ్సైట్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అక్టోబర్ 25 వరకు రిజిస్ట్రేషన్ చివరి తేదీ అని, వివిధ అంశాలపై పరిశోధన పత్రాలు అక్టోబర్ 5 వ తేదీ వరకు సమర్పించాలని, కేవలం "తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలపై  అక్టోబర్ 30"వరకు పరిశోధనా వ్యాసాలను పంపించాలని దానిని ప్రత్యేకమైన జర్నల్లో ప్రచురిస్తున్నామని వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, విద్యార్థులు వారి వ్యాసాలను సమర్పించాలని తెలిపారు. 

మరిన్ని వార్తలు