తొందరెందుకు.. ఆలోచిద్దాం

11-09-2026 | 05:05am

2027 వరల్డ్ కప్‌పై రోహిత్ శర్మ 

ముంబై, సెప్టెంబర్ 10: వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు. కోహ్లీతో పోలిస్తే రోహిత్‌కు అవకాశం లేదన్న వాదన కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో 2027 వన్డే ప్రపంచ కప్‌లో తాను ఆడటంపై భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ(Cricketer Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముంబైలో జరిగిన ’గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్‌ను, 2027 వరల్డ్ కప్‌లో మీ భాగస్వామ్యం ఉంటుందా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, అక్టోబర్ 2027 అనేది చాలా దూరంలో ఉంది, అప్పుడు ఆలోచిద్దామని తేల్చేశాడు. ఒకవేళ భారత్ 2027లో మళ్లీ వన్డే వరల్డ్ కప్ గెలిస్తే, 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ముంబైలో చేసినట్లు ఓపెన్ బస్ పరేడ్ నిర్వహిస్తారా అని అడగ్గా.. ప్రస్తుతానికి అలాంటి బస్ పరేడ్ సాధ్యం కాకపోవచ్చని సమాధానమిచ్చా రు. ప్రపంచకప్ ఆడటంపై రోహిత్ ఇప్పటికప్పుడు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు.

మరిన్ని వార్తలు