21 August, 2026 | 9:46 PM

Breaking News

పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •   కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం   •   అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   రాయినిగూడెంలో బీజేపీ జెండా దిమ్మె తొలగింపు సరికాదు   •   ఆలేరు పోలీసుల తనిఖీల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం   •   భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం   •  

గురుకుల కళాశాలలో ఇంటర్‌ ప్రవేశాలు

21-08-2026 09:08 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ పట్టణంలోని శాస్త్రినగర్‌ లో గల  తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాల (బాలుర)లో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఖాళీలు ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ సూర్య ప్రకాష్ రావు శుక్రవారం తెలిపారు. ఎంపీసీ, బైపిసి గ్రూపుల్లో ఎస్సీ, ఎస్టి  కేటగిరీలకు సీట్లు అందుబాటులో ఉన్నాయనిపేర్కొన్నారు.

ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు కళాశాలకు హాజరు కావాలని సూచించారు. విద్యార్థులు తమ అసలు ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని తెలిపారు. ఖాళీగా ఉన్న సీట్లను అర్హత నిబంధనల మేరకు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ కోరారు.