అజేయ భారత్
ఇది కదా విజయమంటే.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను భారత మహిళల జట్టు మరోసారి ఆటాడుకుంది. మహిళల ఆసియా కప్‌లో భారత స్పిన్నర్లు చెలరేగిన వేళ పాక్ 55 పరుగులకే కుప్పకూలింది. తెలుగమ్మాయి శ్రీ చరణి(3/7), ప్రేమా రావత్‌అదరగొట్టేశారు. చేజింగ్‌లో మూడు వికెట్లు కోల్పోయినా హార్మన్ ప్రీత్, దీప్తి శర్మ జట్టు విజయాన్ని పూర్తి చేశారు.
- పాక్‌ను తిప్పేసిన స్పిన్నర్లు
- 55 పరుగులకే పాక్ ఆలౌట్
- అదరగొట్టిన శ్రీ చరణి, ప్రేమా రావత్
- మహిళల ఆసియా కప్
దుబాయి, సెప్టెంబర్ 5 : టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌కు (Pakistan) భారత బౌలర్లు (Indian bowlers) చుక్కలు చూపించారు. కేవలం 35 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాక్, ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను మునీబా అలీ (13), షవాల్ జుల్ఫికర్ (14) ఆచితూచి ప్రారంభించారు. తొలి వికెట్‌కు 27 పరుగులు జోడిం చి ఫర్వాలేదనిపించారు. అయితే, 27 పరుగుల వద్ద మునీబా అలీని షఫాలీ వర్మ ఔట్ చేయడంతో పాక్ పతనం మొదలైంది.
కేవ లం 8 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కో ల్పోయి దారుణంగా విఫలమైంది. దీప్తి శర్మ, ప్రేమ రావత్, షఫాలీ వర్మ తలో వికెట్ పడగొట్టి పాక్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టారు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా (0)ను దీప్తి శర్మ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపింది. ఈ మ్యాచ్ లో యువ బౌలర్ శ్రీ చరణి తన స్పెల్‌తో పాకిస్థాన్ పతనాన్ని శాసించింది. ఆమె ధాటి కి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ నిలవలేకపోయింది. గుల్ ఫిరోజా (0), షవాల్ జుల్ఫికర్ (14), ఆయేషా జాఫర్ (2)లను పెవిలియన్‌కు పంపి కోలుకోలేని దెబ్బతీసింది.
మొత్తం మీ ద, టాస్ గెలిచి భారీ స్కోరు సాధించాలనుకున్న పాకిస్థాన్ వ్యూహం పూర్తిగా విఫల మైంది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి తన 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, లెగ్ స్పిన్నర్ ప్రేమా రావత్ కూడా 9 పరుగులిచ్చి 3 వికెట్లతో సత్తా చా టింది.
వీరికి దీప్తి శర్మ (2/5) తోడవడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 18.1 ఓవర్లలోనే 55 పరుగుల వద్ద ముగిసింది. పాక్ జట్టులో షవాల్ జుల్ఫికర్ చేసిన 14 పరుగులే అత్యధిక స్కోరు. అనంతరం భారత్.. 8 ఓవర్లలో 3 వికెట్లకు 56 పరుగులు చేసి గెలుపొందింది. షెఫాలీ వర్మ(6 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 12), ప్రతికా రావల్(3 బంతుల్లో ఫో ర్‌తో 4), స్మృతి మంధాన (11 బంతుల్లో 2 ఫోర్లతో 9) విఫలమైనా.. హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ జట్టుకు విజయాన్ని అందించారు.
పాకిస్థాన్ బౌలరల్లో ఫాతిమా సనా(3/17) మూడు వికెట్లు పడగొట్టింది. ఇప్పటికే భారత్ సెమీఫైనల్ చేరగా.. పాకిస్థాన్ తమ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. హాంగ్ కాంగ్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధిస్తే పాకిస్థాన్‌కు సెమీస్ బెర్త్ దక్కుతుంది.
స్కోరు బోర్డు
పాక్ ఇన్నింగ్స్ : 55 ఆలౌట్ (షవాల్ జుల్ఫికర్ 14, మునీబా అలీ 13 ; శ్రీ చరణి 3/7, ప్రేమా రావత్ 3/9 , దీప్తి శర్మ 2/5 )
భారత్ ఇన్నింగ్స్ : 56/3 (హార్మన్ ప్రీత్ 18 నాటౌట్, దీప్తి శర్మ 12 నాటౌట్, ఫాతి మా సనా 3/17)






