రైతులకు సాగునీరు విడుదల చేయాలి

21-09-2026 | 07:38pm

అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరు

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

భూత్పూర్: జూరాల ప్రాజెక్టు నుంచి రైతులు(Farmers) వేసుకున్న పంటలకు సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ(BRS Party) మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం భూత్పూర్ మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామంలో ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టులో 8. 5 టీఎంసీల నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ జూరాల కింద ఉన్న ఆయకట్టు రైతులకు నీళ్లు విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం  విఫలమైందన్నారు.

బీఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Former MLA Ala Venkateswar Reddy)తో పాటు మండల పార్టీ నాయకులకు అక్రమ అరెస్టులు చేయడం ఏమిటని ఆయన తెలిపారు. పై రాష్ట్రాల నుంచి జూరాలకు వరద వచ్చినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్టోరేజ్ చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. కృష్ణా నీళ్లను ఆంధ్ర ప్రభుత్వం వాడుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. రైతులకు నీళ్లు లేకపోవడంతో రైతులు వేసుకున్న పంటలు ఎండిపోతున్న కూడా ఈ ప్రభుత్వానికి చలనం లేకుండా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను బీఆర్ఎస్  ఎత్తి చూపుతుందన్న భయంతో పోలీసులతో బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్టులు చేయిస్తుందన్నారు.

ఏలినో వల్ల వర్షాలు కురవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుస్తుందే తప్ప జూరాల డ్యామ్ నుంచి రైతులకు సాగునీరు అందించడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పై రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లను స్టోర్ చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీరును అందించే వారమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చెరువు, కుంటలను నింపే రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో  ఏ ఒక్క చెరువు అయినా నింపారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ప్రజలు గెలిపించింది ప్రజల సమస్యల కోసం నిరంతరం పనిచేయడానికి తప్ప కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే  పనిచేస్తాం అనడం ఏమిటన్నారు. సాగునీళ్ల విషయంలో దేవరకద్ర ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన మూడేళ్ల తర్వాత కాల్వ గుర్తుకు వచ్చిందా అని ఆయన మండిపడ్డారు. ఈ సీజన్లో తెలంగాణ 18 టీఎంసీలు వాడుకుంటే ఏపీ 100 టీఎంసీలకు పైగా తలించకపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకున్నారే తప్ప ఏం చేయలేదన్నారు. 

కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అక్కడ ఉన్న నీళ్లను విడుదల చేసేందుకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లి నీళ్ల గురించి మాట్లాడాలని అన్నారు. విద్యుత్, సాగునీటి సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అసెంబ్లీలో చెప్పారన్నారు. జూరాల ప్రాజెక్టు నుండి రైతులకు సాగు నీళ్లు విడుదల చేసేంతవరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బస్వా రాజ్ గౌడ్, సీనియర్ పార్టీ నాయకులు మురళీధర్ గౌడ్, నారాయణ గౌడ్, తూము శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆల శ్రీకాంత్ రెడ్డి తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు